సిక్స్త్ సెన్స్ సీజన్ 5 ఈవారం ఎపిసోడ్ చాలా కలర్ ఫుల్ గా మంచి కామెడీతో నవ్వించింది. ఈ షోకి అవినాష్- ఆరియానా, ఆర్జే సూర్య - ఫైమా వచ్చారు. ఎగ్ బ్రేక్ చేసే టాస్క్ లో తాను హెల్ప్ చేయాలి అంటే అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్పాలి అంటూ ఓంకార్ ఒక కండిషన్ పెట్టాడు ఆరియానాకి.."ఆరియానా పెళ్ళెప్పుడు..అసలు ఎలాంటి అబ్బాయి కావాలి" అని ఓంకార్ అడిగేసరికి "నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా..అర్ధం చేసుకునే అబ్బాయి వస్తే చాలు" అని చెప్పింది ఆరియానా. "సరే నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కాబట్టి నా టీమ్ లో ముగ్గురు పెళ్లి కానీ వాళ్ళు ఉన్నారు..ఒక్కొక్కరిని స్టేజి మీదకు తీసుకొస్తాను. నీకు నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు" అన్నాడు ఓంకార్. "సిక్స్త్ సెన్స్ లో ఆరియానాకి పెళ్లి చూపులు జరగబోతున్నాయి అది కూడా ఓంకార్ గారి చేతుల మీదుగా" అని కోరస్ ఇచ్చాడు అవినాష్.
తర్వాత స్టేజి మీదకు దేవరాజ్ అనే అతన్ని పిలిచారు. "దేవరాజ్ ముందు మనకు హైట్ సెట్ అవుతుందో లేదో చూసుకుందాం ఓకే సెట్ అయ్యింది. మన పేర్లు సెట్ అవుతాయా ఆరియానా వెడ్స్ దేవరాజ్ ఓకే..నేను మీకు మేకప్ లో ఓకే కదా అని అనడంతో మేకప్ తీసేయండి అన్నాడు..అదెలా తీస్తారు తీస్తే పెళ్లవుతుందా ఏమిటి అంది ఫన్నీగా ఆరియానా. ఐనా నా కోసం వచ్చేటప్పుడు కొంచెం రెడీ అయ్యి రావచ్చుగా...అనేసరికి నాచురల్ గా ఉందామని అన్నాడు దేవరాజ్. సరే నేను మీ గురించి ఆలోచిస్తాను...ప్రస్తుతానికి దేవరాజ్ కి 66 మార్క్స్ వేస్తున్నా" అని చెప్పింది ఆరియానా.
తర్వాత స్టేజి మీదకు గోపి అనే అతను వచ్చాడు.."గోపి నేను నిన్ను చేసుకోలేను ఎందుకంటే నువ్వు ఎక్సయిటెడ్ గా లేవు...ప్రింటెడ్ షర్ట్ వేసుకు రాలేదు..చాల మొహమాటం..ఇంత సాంప్రదాయమైన అబ్బాయి నాకెలా సెట్ అవుతాడు...ఐనా గోపికి 55 మార్క్స్ ఇస్తున్నా" అని చెప్పింది ఆరియానా. తర్వాత ఒక స్టేజి మీదకు ఒక అమ్మాయి వచ్చింది. ఆమెను చూసేసరికి "నేను మీకు ఏం అన్యాయం చేసానని..మీరే లైఫ్ ఇచ్చారు కదా..పెళ్లి చేసి సెటిల్ చేస్తారు అనుకున్నా..మా టీవీ వాళ్ళే పెళ్లి కొడుకును చూస్తారు అనుకుంటే ఇలా చేస్తారా నన్ను" అని ఫీలయ్యింది ఆరియానా. "అంటే ఇద్దరు అబ్బాయిలు నచ్చలేదు కదా ఏమో... అందుకే అమ్మాయిని తీసుకురావాల్సి వచ్చింది" అని చెప్పారు ఓంకార్.. "సరే ముగ్గురిలో తప్పక చేసుకోవాల్సి వస్తే ఎవరిని చేసుకుంటావ్" అని ఓంకార్ అడిగేసరికి "దేవరాజ్ ని గోపిని ఇద్దరినీ చేసుకుంటాను" అని చెప్పింది.